ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్ కు వస్తున్నారు?: ప్రధాని మోదీని ప్రశ్నించిన కేటీఆర్
- జులై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
- హైదరాబాదులో సమావేశాలు
- నగరానికి వస్తున్న మోదీ, అమిత్ షా తదితరులు
- విమర్శలు గుప్పించిన కేటీఆర్
జులై 2, 3 తేదీల్లో హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఇతర బీజేపీ అగ్రనేతలు హైదరాబాదుకు వస్తున్నారు. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం సాయం చేశారు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్ వస్తున్నారని నిలదీశారు.
వేల కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రకటనలు చేస్తారే తప్ప, అందులో వాస్తవం ఉండదని విమర్శించారు. 2014లో జన్ ధన్ ఖాతాలు తెరవాలని చెప్పారని, రూ.15 లక్షలు వేస్తానని మోదీ వెల్లడించారని కేటీఆర్ తెలిపారు. కానీ, ఒక్కరి ఖాతాలో అయినా రూ.15 లక్షలు పడ్డాయా? అని ప్రశ్నించారు. పాపం... బీహార్ లో దాస్ అనే వ్యక్తి ఖాతాలో లక్షల కొద్దీ డబ్బు పడితే, ఆ డబ్బులు మోదీనే వేశాడనుకుని దాస్ ఇంటి నిర్మాణం కోసం ఖర్చు చేశాడని కేటీఆర్ వివరించారు. కానీ అది బ్యాంకు పొరబాటు అని ఆ తర్వాత తేలిందని తెలిపారు.
ఇలాంటివి దేశంలో మోదీ చాలా చెప్పారని విమర్శించారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పారని, ఎక్కడ ఇచ్చారు ఇల్లు? అని నిలదీశారు. ఇంటింటికీ కుళాయి నీరు అందిస్తామని చెప్పారని, తెలంగాణలో మిషన్ భగీరథ పేరిట తామే ఇంటింటికీ నీరు అందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. అందుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు.
గతేడాది హైదరాబాదుకు వరదలు వస్తే, పేదలకు రూ.10 వేల కోట్ల మేర సాయం చేశామని కేటీఆర్ చెప్పారు. మోదీని సాయం అడిగితే ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదని అన్నారు. అదే, గుజరాత్ లో వరదలు రాగానే హుటాహుటీన వెళ్లి రూ.1000 కోట్లు ఇచ్చారని విమర్శించారు. కానీ ఇప్పుడు హైదరాబాదు వస్తున్నామని చెబుతున్నారని, ఏం చేయడానికి వస్తున్నారు? అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"దేశాన్ని రామరాజ్యం చేస్తామన్నారు... కానీ రావణ కాష్ఠం చేశారు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టారు. దేశంలో మతపిచ్చి లేపారు. అగ్నిపథ్ అనే పథకం తీసుకువచ్చి దేశ యువత పొట్టకొడుతున్నారు. వాళ్లు నిరసనలు తెలుపుతుంటే, వాళ్లను దేశద్రోహులంటున్నారు. కేబినెట్ లో ఉండే కిషన్ రెడ్డి అనే ఒకాయన అగ్నిపథ్ చాలా మంచిదంటాడు.. అగ్నిపథ్ లో చేరిన తర్వాత బట్టలు ఉతకొచ్చని, కటింగ్ చేయొచ్చు, ఎలక్ట్రీషియన్ పనులు చేయొచ్చు, డ్రైవర్ అవ్వొచ్చు అంటాడు... ఇవన్నీ చేయడానికి దేశ యువత సైన్యంలోకి పోవాలా?" అంటూ ప్రశ్నించారు.