విశాఖకు ఇన్ఫోసిస్... భారీ క్యాంపస్ ఏర్పాటుకు టెక్ దిగ్గజం సంసిద్ధత
- మంత్రి గుడివాడ అమర్నాధ్‌తో ఇన్ఫోసిస్ ప్రతినిధుల భేటీ
- లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్‌కు ఇన్ఫోసిస్ సిద్ధం
- తొలుత 1,000 సీటింగ్ కెపాసిటీతో క్యాంపస్
- విడతల వారీగా 3వేల సీటింగ్ కెపాసిటీకి పెంపు
ఏపీలో భారీ క్యాంపస్ ఏర్పాటుకు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. విడతల వారీగా 3 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ క్యాంపస్‌ను సాగర నగరం విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవలే ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.
తొలి దశలో 1,000 సీటింగ్ కెపాసిటీతో ఈ క్యాంపస్‌ను ఆ సంస్థ ప్రారంభించనుంది. ఈ క్యాంపస్ ఏకంగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని సమాచారం. అంతేకాకుండా తొలుత వెయ్యి సీటింగ్ కెపాసిటీతోనే ప్రారంభం కానున్న ఈ క్యాంపస్‌ను ఇన్ఫోసిస్ దశలవారీగా 3 వేల సీటింగ్ కెపాసిటీకి పెంచనుందట.