అత్యంత పరుగుల రాణిగా రికార్డు సృష్టించనున్న హర్మన్ ప్రీత్ కౌర్
- టీ20ల్లో హర్మన్ స్కోరు 2,319 పరుగులు
- మిథాలీ రాజ్ పేరిట 2,364 పరుగులు
- మరో 45 పరుగులు సాధిస్తే హర్మన్ పేరిట రికార్డు
భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. టీ20 మ్యాచుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు నమోదు చేయనుంది. 121 టీ20 మ్యాచుల్లో హర్మన్ ప్రీత్ కౌర్ 2,319 పరుగులు చేసి.. 26.35 సగటుతో ఉంది.
పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ మిథాలీరాజ్ రికార్డుకు 45 పరుగుల దూరంలో ఉంది. మిథాలీ ఇటీవలే అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే. భారత్ తరఫున అత్యధిక పరుగుల రాణిగా ప్రస్తుతం మిథాలీరాజ్ ఉంది. 89 మ్యాచుల్లో 2,364 పరుగులతో సగటు 37.52తో ఉంది. 17 అర్ధ సెంచరీలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
శ్రీలంకతో మూడు టీ20 మ్యాచులు ఈ నెల 23, 25, 27 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్ కు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఇందులో హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచి రాణిస్తే.. మిథాలీరాజ్ రికార్డు వెనక్కి వెళ్లిపోవడం ఖాయమని తెలుస్తోంది. టీ20ల్లో అత్యంత పరుగులు నమోదు చేసిన భారత మహిళా క్రికెటర్ గా గుర్తింపు హర్మన్ ప్రీత్ కు దక్కనుంది.