కూకట్ పల్లి నియోజకవర్గంలో ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్

  • కైతలాపూర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్
  • రూ. 86 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం
  • కూకట్ పల్లి, హైటెక్ సిటీ మధ్య తగ్గనున్న ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఫ్లైఓవర్లను నిర్మించింది. తాజాగా మరో ఫ్లైఓవర్ నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కూకట్ పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. రూ. 86 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ వల్ల కూకట్ పల్లి, హైటెక్ సిటీల మధ్య ప్రయాణం సాఫీగా సాగనుంది. బాలానగర్ వైపు నుంచి వచ్చే వారికి ఈ ఫ్లైఓవర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల జేఎన్టీయూ, మలేషియా టౌన్ షిప్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, హైటెక్ సిటీ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి.


More Telugu News