సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కుమార్ మృతి
- కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్
- ఈ తెల్లవారుజామున కన్నుమూత
- ap7amతో శ్రీనివాస్ కు ప్రత్యేకమైన అనుబంధం
సీనియర్ జర్నలిస్ట్ ఎం. శ్రీనివాస్ కుమార్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. పలు దినపత్రికలకు సేవలు అందించిన శ్రీనివాస్ ప్రస్తుతం సూర్య దినపత్రికలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఉన్నారు. శ్రీనివాస్ మరణవార్తతో జర్నలిస్టులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
సౌమ్యుడు, స్నేహశీలి అయిన శ్రీనివాస్ కు ap7am న్యూస్ వెబ్ సైట్ తో కూడా ఎంతో అనుబంధం ఉంది. తరచుగా ap7amకు ఆయన వార్తలను కాంట్రిబ్యూట్ చేసేవారు. వార్తను వేగంగా రాయడమే కాకుండా, ప్రెజంటేషన్ లో కూడా తనదైన శైలిని చూపించే శ్రీనివాస్ మృతి పట్ల ap7am టీమ్ సంతాపాన్ని ప్రకటిస్తోంది. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తోంది. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ap7am టీమ్ ప్రార్థిస్తోంది.
శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం ఒంగోలు పట్టణంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.