ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం

  • జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోం
  • నియామకపత్రాన్ని అందించిన కలెక్టర్ కృతికా శుక్లా
  • కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వోకు ఆదేశాలు
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆమెకు జూనియర్ అసిస్టెంట్‌గా అవకాశం కల్పిస్తూ కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా  నిన్న నియామకపత్రాన్ని అపర్ణకు అందజేశారు. 

ఆమె ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతరావును కలెక్టర్ ఆదేశించారు. కాగా, ఈ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నిన్న ముగిసింది. దీంతో ఆయనను రాజమహేంద్రవరం కోర్టులో ప్రవేశపెట్టగా జులై 1 వరకు ఆయన రిమాండును న్యాయస్థానం పొడిగించింది.


More Telugu News