ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, వైస్ చైర్మన్ లకు క్యాబినెట్ హోదా ఖరారు
- గతేడాది నామినేటెడ్ పోస్టుల భర్తీ
- ఏపీఎస్ఆర్టీసీకి చైర్మన్, వైస్ చైర్మన్ నియామకం
- అవకాశం దక్కించుకున్న మల్లికార్జునరెడ్డి, విజయానందరెడ్డి
- ఎస్ కేటగిరీ కింద క్యాబినెట్ హోదా ఖరారు
గతేడాది ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం సమీప బంధువు ఏ.మల్లికార్జునరెడ్డి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమితులు కాగా, సంస్థ వైస్ చైర్మన్-డైరెక్టర్ గా చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డికి అవకాశం ఇచ్చారు. కాగా, వీరిద్దరికీ క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన జీవోను సాధారణ పరిపాలన శాఖ గత నెల 17నే విడుదల చేసింది. తాజాగా, ఎస్ కేటగిరీ కింద క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.