ముగిసిన రాహుల్ గాంధీ ఈడీ విచారణ... రేపు మళ్లీ రావాలంటూ సమన్లు
- నాలుగో రోజు 10 గంటల పాటు రాహుల్ విచారణ
- 4 రోజుల్లో దాదాపుగా 40 గంటల పాటు రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
- మంగళవారం కూడా విచారణకు రావాలంటూ రాహుల్‌కు ఈడీ సమన్లు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వరుసగా మంగళవారం ఐదో రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన రాహుల్ గాంధీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
గత వారం 3 రోజుల పాటు తమ ముందు విచారణకు హాజరైన రాహుల్ గాంధీని ఈడీ అధికారులు దాదాపుగా 30 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా సోమవారం నాటి విచారణలో కూడా రాహుల్ గాంధీని ఈడీ అధికారులు దాదాపుగా 10 గంటల పాటు విచారించారు. వెరసి 4 రోజుల విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్‌ను 40 గంటల పాటు విచారించినట్టయింది. నాలుగో రోజు విచారణ ముగింపు సందర్భంగా మంగళవారం కూడా విచారణకు రావాల్సిందేనని రాహుల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.