అప్పుల పెరుగుదల చంద్రబాబు హయాంలోనే ఎక్కువ: గణాంకాలు సహా వివరించిన వైసీపీ

  • అప్పుల పెరుగుదలపై వైసీపీ స్పందన
  • అప్పు విలువ ఎప్పుడెంత? అంటూ ఆసక్తికర ట్వీట్
  • బాబు హయాంలో అప్పుల పెరుగుదల ఎక్కువని వెల్లడి
  • జగన్ పాలనలో చాలా తగ్గిందని స్పష్టీకరణ
ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, కొత్త అప్పులకు ప్రయత్నిస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలను అధికార వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు పాలనతో పోల్చితే, జగన్ పాలనలోనే అప్పుల వృద్ధి రేటు తగ్గిందని వైసీపీ వెల్లడించింది. ఈ మేరకు గణాంకాలతో కూడిన వివరణ ఇచ్చింది. 

చంద్రబాబు పాలనలో వార్షిక అప్పు వృద్ధి రేటు 19.46 శాతం అని, సీఎం జగన్ పాలనలో అది 15.77 శాతానికి తగ్గిందని పేర్కొంది. రాష్ట్ర విభజన నాటికి అప్పులు రూ.1.34 లక్షల కోట్లు కాగా, చంద్రబాబు హయాం నాటికి అవి రూ.3.27 లక్షల కోట్లకు పెరిగాయని వెల్లడించింది. అంటే చంద్రబాబు పాలన నుంచి దిగిపోయే నాటికి సగటు వార్షిక అప్పు వృద్ధిరేటు 19.46 శాతం అని వైసీపీ వివరించింది. అయితే, జగన్ మూడేళ్ల పాలనలో అప్పుల విలువ రూ.4.98 లక్షల కోట్లకు చేరుకుందని, ఆ లెక్కన సగటు వార్షిక అప్పు వృద్ధిరేటు 15.77 శాతం మాత్రమేనని తెలిపింది. 

అంతేకాదు, చంద్రబాబు హయాంలో అప్పుల పెరుగుదల 143.25 శాతంగా ఉంటే, జగన్ పాలనలో 52.36 శాతమేనని వైసీపీ వెల్లడించింది.


More Telugu News