ఆస్తి ప‌న్ను మ‌దింపులో త‌ప్పుడు లెక్క‌లు చూపిన ఆసుప‌త్రి.. రూ.24 కోట్ల జ‌రిమానా!

  • బాచుప‌ల్లిలో ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి సేవ‌లు
  • ఆస్తి ప‌న్ను మ‌దింపులో త‌ప్పుడు లెక్క‌లు చూపిన ఆసుప‌త్రి
  • రూ.24 కోట్ల మేర భారీ జ‌రిమానా విధించిన వైనం
అదో ప్రైవేట్ ఆసుప‌త్రి. ఖ‌రీదైన వైద్యం అందిస్తూ కూడా ఆస్తి ప‌న్నుకు సంబంధించి త‌ప్పుడు లెక్క‌లు చూపింది. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ ఆసుప‌త్రికి ఏకంగా రూ.24 కోట్ల జ‌రిమానా విధించారు. హైద‌రాబాద్ శివారు నిజాంపేట మునిసిపల్ కార్పొరేషన్ ప‌రిధిలోని బాచుప‌ల్లిలో ఈ ఘటన చోటుచేసుకొంది. 

బాచుప‌ల్లి ప‌రిధిలో ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి పేరిట ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి వైద్య సేవ‌లందిస్తోంది. ఏటా స‌ద‌రు ఆసుప‌త్రి ఆస్తి ప‌న్నును మునిసిపల్ కార్పొరేషన్ కు క‌ట్టే క్ర‌మంలో ఆస్తి ప‌న్ను మ‌దింపున‌కు సంబంధించి అధికారుల‌కు త‌ప్పుడు లెక్క‌లు చెప్పారు. త‌క్కువ ప‌న్నే క‌ట్టారు. ఈ విష‌యాన్ని గుర్తించిన నిజాంపేట మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు... ఆ ఆసుప‌త్రికి ఏకంగా రూ.24 కోట్ల జ‌రిమానాను విధించారు.


More Telugu News