సికింద్రాబాద్ కాల్పుల ఘటనపై మావోయిస్టుల స్పందన ఇదే
- తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పేరిట మావోయిస్టుల లేఖ
- అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్
- పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలన్న మావోయిస్టులు
- ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై మావోయిస్టులు స్పందించారు. కాల్పుల ఘటనను ఖండిస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ పేరిట మావోయిస్టులు సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించిన మావోయిస్టులు... ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని కూడా మావోయిస్టులు ఆ లేఖలో డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన రాకేశ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, బాధితుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా కాల్పులు జరిపిన పోలీసులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.