తెలంగాణ 'నీరా'కు కేంద్రం లైసెన్స్‌!

  • నెక్లెస్ రోడ్‌లో నీరా కేఫ్‌
  • నీరా, నీరా ఉత్ప‌త్తుల విక్ర‌య‌మే ప్ర‌ధాన లక్ష్యం
  • ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి లైసెన్స్ వ‌చ్చింద‌న్న మంత్రి
  • నీరాను గ‌త ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్యం చేశాయ‌న్న శ్రీనివాస్ గౌడ్‌
స‌హ‌జ‌సిద్ధ‌మైన నీరా, నీరా ఉత్ప‌త్తుల దిశ‌గా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వానికి సోమ‌వారం కీల‌క ఆమోదం ల‌భించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి లైసెన్స్ ల‌భించింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ఈ లైసెన్స్ తెలంగాణ నీరా చ‌రిత్ర‌లోనే ఓ సువర్ణాధ్యాయంగా అభివ‌ర్ణించారు. 

స‌హ‌జ‌సిద్ధంగా చెట్ల నుంచి వ‌స్తున్న నీరాను గ‌త ప్రభుత్వాలు నిర్ల‌క్ష్యం చేశాయ‌ని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నీరా మ‌త్తు ప‌దార్థం కాద‌ని, ఔష‌ధ గుణాలున్న స‌హ‌జ‌సిద్ధ ద్రావ‌ణ‌మ‌ని పేర్కొన్నారు. దీనిని ప్రోత్స‌హించేందుకు నెక్లెస్ రోడ్‌లో నీరా కేఫ్‌ను ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు. ఈ కేంద్రం ద్వారా నీరాతో పాటు నీరా ఉత్ప‌త్తుల విక్ర‌యాల‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.


More Telugu News