ఉత్తరాంధ్రకు పిడుగుపాటు హెచ్చరిక... వివరాలు ఇవిగో!
- ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన
- ఆయా మండలాల వివరాల వెల్లడి
- రైతులు, కూలీలు, పశువుల కాపర్లకు హెచ్చరిక
ఏపీలోని పలు జిల్లాల్లో నేడు పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలలోని పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల, గొర్రెల కాపరులు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని స్పష్టం చేసింది.
పిడుగులు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలు ఇవే...
శ్రీకాకుళం జిల్లా: టెక్కలి, లక్ష్మీనరసుపేట, ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, కవిటి, నందిగం, వజ్రపుకొత్తూరు, పలాస, పాతపట్నం, హీరమండలం, కొత్తరు, సారవకోట, మందస, మెలియపుట్టి.
అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి.
అనకాపల్లి జిల్లా: కె.కొత్తపల్లి, దేవరపల్లి, చీడికాడ.
పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ, బలిజిపేట, సీతంపేట, పాచిపెంట.
విజయనగరం జిల్లా: బొబ్బిలి, దత్తిరాజేరు, శృంగవరపుకోట, బొండపల్లి, వంగర, ఆమదాలవలస, తెర్లాం, విజయనగరం, మెంటాడ, మెరముడిదం, గజపతినగరం, నెల్లిమర్ల, సంతకవిటి, రామభద్రాపురం, రాజాం, దత్తిరాజేరు, రేగడి.
శ్రీకాకుళం జిల్లా: టెక్కలి, లక్ష్మీనరసుపేట, ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, కవిటి, నందిగం, వజ్రపుకొత్తూరు, పలాస, పాతపట్నం, హీరమండలం, కొత్తరు, సారవకోట, మందస, మెలియపుట్టి.