వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగింపు
- డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన అనంతబాబు
- రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఎమ్మెల్సీ
- జులై 1వరకు ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు నిర్ణయం
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు జులై 1 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు సోమవారం నిర్ణయం తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అనంతబాబు తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంను తన వెంట తీసుకెళ్లి చంపేసి, ఆ తర్వాత మృతదేహాన్ని బాధితుడి ఇంటి వద్ద వదిలి వెళ్లిన ఘటన ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అనంతబాబు తన నేరాన్ని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విపక్షాలు వైసీపీని టార్గెట్ చేయగా... అనంతబాబును బహిష్కరిస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు సోమవారంతో ముగియగా... ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.