ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: అచ్చెన్నాయుడు
- గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో నరేంద్ర అరెస్ట్
- అనుమర్లపూడి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్న ధూళిపాళ్ల
- చలో అనుమర్లపూడికి పిలుపు.. అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు
టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. పొన్నూరులో అక్రమ మైనింగ్ చేస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చేస్తున్న నరేంద్రను పోలీసులు అక్రమంగా అరెస్టును చేశారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని అనుమర్లపూడి గ్రామం చెరువులో మట్టి దోపిడీ జరుగుతోందని నరేంద్ర ఆరోపించారు. గ్రామంలో మట్టి తవ్వకాలను వ్యతిరేకిస్తూ ‘చలో అనుమర్లపూడి’కి పిలుపునిచ్చారు. అయితే, చలో అనుమర్లపూడికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు.
పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కానీ, పోలీసుల కళ్లుగప్పిన ధూళిపాళ్ల నరేంద్ర అనుమర్లపూడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.