ఆ ఆరోపణలపై దృష్టి మరల్చేందుకేనా అగ్నిపథ్ తెచ్చింది?: కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్న
- శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టు దక్కించుకున్న అదానీ గ్రూపు
- అదానీకే ప్రాజెక్టు వచ్చేలా లంక ప్రభుత్వంపై మోదీ ఒత్తిడి తెచ్చారని ఆరోపణ
- దీనిపై శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలు
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో భారత ప్రధాని నరేంద్ర మోదీ- ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అవినీతి బంధంపై వస్తున్న ఆరోపణలపై దేశం దృష్టిని మరల్చేందుకే ఈ పథకాన్ని ప్రకటించారా? అని ట్విట్టర్లో ప్రశ్నించారు.
శ్రీలంకలో ఓ విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇచ్చేలా లంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సపై మోదీ ఒత్తిడి తెర్చారని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, తన పదవికి రాజీనామా చేశారు. కానీ, ఈ వ్యాఖ్యలపై భారత్ లో విపక్షాలు మోదీపై భగ్గుమన్నాయి. అటు శ్రీలంకలో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి.
దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీని, ప్రధాని మోదీని కేటీఆర్ గతంలోనూ ప్రశ్నించారు. తాజాగా అగ్నిపథ్ పథకాన్ని ఈ వివాదంతో ముడిపెడుతూ ట్వీట్ చేశారు.