అగ్నిపథ్ నిరసనకారులపై మండిపడ్డ ఆర్మీ మాజీ చీఫ్!

  • అగ్నిపథ్ నచ్చకపోతే అందులో చేరవద్దన్న వీకే సింగ్ 
  • సైనికుడిగా చేరాలని సైన్యం ఎవరినీ బలవంతం చేయదని వ్యాఖ్య 
  • బస్సులు, రైళ్లు ఎందుకు తగలబెడుతున్నారని నిలదీత 
అగ్నిపథ్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న వారిపై ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ మండిపడ్డారు. అగ్నిపథ్ నచ్చకపోతే అందులో చేరవద్దని అన్నారు. ఈ కార్యక్రమం నచ్చని వాళ్లు త్రివిధ దళాల్లో చేరాలనే ఆలోచనను మానుకోవాలని సూచించారు. సైనికులుగా చేరాలని భారత సైన్యం ఎవరినీ ఎప్పుడూ బలవంతం చేయదని... సైన్యంలో పని చేయాలనే కోరిక ఉన్న వారు తమ ఇష్టానుసారం చేరుతారని చెప్పారు. 

అగ్నిపథ్ లో చేరమని మిమ్మల్ని ఎవరు బలవంతపెడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. మీరు బస్సులు, రైళ్లు ఎందుకు తగలబెడుతున్నారని మండిపడ్డారు. మీ అందరినీ అగ్నిపథ్ లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారని.. మీకు సైన్యంలో చేరే అర్హతలు ఉన్నప్పుడే తీసుకుంటారని అన్నారు. 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని వేసినప్పుడు అగ్నిపథ్ పథకం ఆలోచన వచ్చిందని చెప్పారు.


More Telugu News