నేడు భారత్ బంద్.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
- అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు
- పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపు
- విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ఝార్ఖండ్
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పలు నిరసన బృందాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హర్యానా, ఝార్ఖండ్, పంజాబ్, కేరళ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి.
ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. నేడు 2 వేల మందికిపైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఝార్ఖండ్‌లో నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.