తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి
- ఇప్పటిదాకా తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్న భుయాన్
- సీనియారిటీ ప్రకారం రెండోస్థానం
- పదోన్నతి కల్పించాలన్న సుప్రీం కొలీజియం
- రాష్ట్రపతి ఉత్తర్వులపై కేంద్రం గెజిట్ విడుదల
తెలంగాణ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. తెలంగాణ హైకోర్టుకు ఇప్పటిదాకా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తెలంగాణ హైకోర్టుకు నూతన సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను నియమించారు.
ఉజ్జల్ భుయాన్ ఇప్పటిదాకా తెలంగాణ హైకోర్టులో సీనియారిటీ ప్రకారం రెండో స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి కల్పించాలన్న సుప్రీంకోర్టు కొలీజయం సిఫారసుల మేరకు ఈ నియామకం చేపట్టారు. దీనిపై రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయగా, కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.