అది నిరుద్యోగుల పాలిట అగ్నిబాట‌... అగ్నిప‌థ్‌పై రాహుల్ గాంధీ కామెంట్‌

  • గత 8 ఏళ్ల‌లో 16 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించాల్సి ఉందన్న రాహుల్ 
  • యువ‌త‌కు ప‌కోడీలు ఫ్రై చేసుకునే జ్ఞానం మాత్ర‌మే క‌ల్పించారని వ్యంగ్యం
  • దీనికి మోదీనే బాధ్య‌త వ‌హించాలని వెల్లడి 
భార‌త సైన్యంలోకి భారీ నియామ‌కాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ ప‌థ‌కంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ఘాటుగా స్పందించారు. అగ్నిప‌థ్ నిరుద్యోగుల పాలిట అగ్నిబాట‌గా మారిపోయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉద్యోగాల‌పై త‌ప్పుడు ఆశ‌లు క‌ల్పించ‌డం ద్వారా దేశంలోని యువ‌తను నిరుద్యోగం అనే అగ్నిబాట‌లో న‌డిచేలా చేశారంటూ ఆయ‌న న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

గ‌డ‌చిన 8 ఏళ్ల‌లో 16 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించాల్సి ఉంద‌ని రాహుల్ గాంధీ అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన మోదీ స‌ర్కారు యువ‌త‌కు ప‌కోడీలు ఫ్రై చేసుకునే జ్ఞానం మాత్ర‌మే క‌ల్పించింద‌ని ఆయ‌న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో నెల‌కొన్న ఇలాంటి ప‌రిస్థితికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీనే బాధ్య‌త వ‌హించాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.


More Telugu News