విజయవాడలో గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

  • నగరంలోని పలు ప్రాంతాలు జలమయం
  • రహదారులపైకి చేరిన వర్షపు నీరు
  • పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు
  • డ్రైనేజీ వ్యవస్థ మరింత మెరుగుపర్చాలంటున్న స్థానికులు
గత కొన్ని వారాలుగా ఎండలతో అల్లాడిపోయిన విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు గంటసేపు ఏకధాటిగా వర్షం కురిసింది. భారీవర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. బెంజ్ సర్కిల్, రాణిగారితోట, ఎంజీ రోడ్, కృష్ణలంక, ఏలూరు రోడ్, మొగల్రాజపురంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. 

విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలోనూ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. నీళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. నేడు కురిసిన వర్షాలకు డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తుండడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు.


More Telugu News