ఐటీపీఓ టన్నెల్‌ ప్రారంభోత్స‌వానికి వ‌చ్చి చెత్త ఏరిన ప్ర‌ధాని మోదీ... వైర‌ల్ అవుతున్న వీడియో ఇదిగో

  • ఢిల్లీలో రూ.920 కోట్ల‌తో ఐటీపీఓ ట‌న్నెల్ నిర్మాణం
  • ఆదివారం ప్రారంభించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ
  • కారిడార్‌లో పెంకులు, కూల్ డ్రింక్ బాటిళ్ల‌ను స్వయంగా తీసిన ప్ర‌ధాని
  • మోదీ అంకిత భావాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్న ప్ర‌ముఖులు
భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత న‌రేంద్ర మోదీ చేప‌ట్టిన అత్యంత ప్ర‌జాద‌ర‌ణ ల‌భించిన ప‌థ‌కాల్లో స్వ‌చ్ఛ భార‌త్ ఒక‌టి. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకునే దిశ‌గా ప్రారంభించిన ఈ ప‌థ‌కం దేశంలో ప‌లు విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప‌థ‌కం అమ‌లు ప‌ట్ల మోదీ స‌ర్కారు కూడా కీల‌క శ్ర‌ద్ధ పెట్టింది. ఈ ప‌థ‌కానికి మోదీ ఎంత‌గా ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ఆదివారం ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారిపోయింది. 

దేశ రాజ‌ధాని ఢిల్లీలో రూ.920 కోట్ల‌తో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఏర్పాటు చేసిన‌ ప్ర‌గ‌తి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్‌ను ప్రారంభించేందుకు ఆదివారం ఉద‌యం ప్ర‌ధాని మోదీ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా కొత్త నిర్మాణాన్ని ప‌రిశీలించేందుకు ఒంటరిగా కారిడార్‌లోకి ప్ర‌వేశించిన మోదీ... అక్క‌డ క‌నిపించిన చిన్న చిన్న పెంకుల‌ను స్వ‌యంగా వంగి మ‌రీ త‌న చేతుల‌తో తీశారు. ఆ త‌ర్వాత అటుగా న‌డుస్తూ కారిడార్‌ గోడ‌కు అనుకుని ప‌డిపోయిన ఓ కూల్ డ్రింక్ బాటిల్‌ను కూడా మోదీ త‌న చేతుల‌తోనే తీశారు. ఈ దృశ్యాల‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ కాగా... ప్ర‌ముఖులు మోదీ అంకిత భావాన్ని ఆకాశానికెత్తేస్తూ వ‌రుస‌బెట్టి స్పందిస్తున్నారు. దీంతో ఈ వీడియో క్ష‌ణాల్లోనే వైర‌ల్‌గా మారిపోయింది.


More Telugu News