హైదరాబాదులో వర్షం... రాగల రెండ్రోజులు కూడా వానలే!
- నిన్న రాత్రి కూడా హైదరాబాదులో వాన
- ఇవాళ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
- రహదారులపై నీళ్లు
- పొంగిపొర్లిన నాలాలు
- ఇబ్బందిపడిన వాహనదారులు
హైదరాబాదులో ఇవాళ కూడా వర్షం కురిసింది. శనివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాలను పలకరించిన వరుణుడు నేడు కూడా ప్రత్యక్షమయ్యాడు. జూబ్లీహిల్స్, అమీర్ పేట, పంజాగుట్ట, సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, బాచుపల్లి, కర్మన్ ఘాట్, నిజాంపేట, కాచిగూడ, బేగంపేట, బోయిన్ పల్లి, నల్లకుంట, బంజారాహిల్స్, కూకట్ పల్లి, గోల్నాక, అంబర్ పేట ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.
రహదారులపై నీళ్లు నిలవగా, కొన్నిచోట్ల నాలాలు పొంగిపోర్లాయి. దాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాగా, రుతుపవనాలు, ఉపరితలద్రోణి ప్రభావంతో మరో రెండ్రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.