రష్యా నుంచి చమురే కాదు.. చౌక ధరకే భారీగా బొగ్గు దిగుమతి
- 20 రోజుల్లో 331 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతులు
- క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆరు రెట్లు అధికం
- 31 రెట్లు పెరిగిన చమురు దిగుమతులు
- చౌక సరఫరాలను సద్వినియోగం చేసుకుంటున్న కేంద్రం
కష్టకాలంలో రష్యా, భారత్ పరస్పరం వాణిజ్య పరంగా సహకారం అందించుకుంటున్నాయి. భారత్ కు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే చౌకకే చమురును రష్యా సరఫరా చేస్తోంది. అంతేకాదు, బొగ్గును కూడా చౌక ధరకే అందిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే బొగ్గు గడిచిన 20 రోజుల్లో ఆరు రెట్లు పెరిగింది.
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగినందుకు పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలను రష్యా చవిచూస్తోంది. ఆయాదేశాలతో రష్యా వాణిజ్య బంధం ప్రమాదంలో పడింది. దీంతో భారత్, చైనా తదితర దేశాల సాయాన్ని రష్యా అర్థించింది. తక్కువ ధరలకే సరఫరా చేస్తామని ముందుకు రావడంతో.. భారత్ 30 శాతం తక్కువ ధరకే ముడి చమురు పొందుతోంది. ఇప్పుడు బొగ్గు వంతు వచ్చింది. రవాణా చార్జీలు అధికంగా ఉన్నప్పటికీ తక్కువ ధరకు వస్తుండడంతో బొగ్గు దిగుమతులు పెంచుకున్నట్టు ఓ నివేదిక వెలువడింది.
గడిచిన 20 రోజుల్లో (గత బుధవారం నాటికి) రష్యా నుంచి బొగ్గు దిగుమతులు ఆరు రెట్లు అధికంగా (క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే) 331.17 మిలియన్ టన్నులు నమోదైనట్టు విశ్వసనీయ వర్గాల ఆధారంగా ఓ నివేదిక వెలువడింది. అంతేకాదు గడిచిన 20 రోజుల్లో చమురు దిగుమతుల విలువ 31 రెట్లు పెరిగి 2.22 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవాలని అమెరికా, ఇతర యూరోప్ దేశాలు సలహా ఇచ్చాయి. కానీ, దేశ ప్రయోజనాలు తమకు ముఖ్యమని మోదీ సర్కారు వాటికి తేల్చి చెప్పడం తెలిసిందే. అంతేకాదు తన చర్యను సమర్థించుకుంది. ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలు నిర్మించుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగిపోతాయని హెచ్చరించింది.