నేడు రాహుల్​ గాంధీ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా కాంగ్రెస్​... కారణం ఇదే

  • వేడుకలు వద్దని నాయకులు, కార్యకర్తలకు రాహుల్ సూచన
  • అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో నిర్ణయం
  • దేశ యువతకు అండగా నిలవాలని శ్రేణులకు ఆదేశం
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  52వ పడిలోకి అడుగు పెట్టారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు. సాధారణంగా  రాహుల్ గాంధీ పుట్టిన రోజు అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల హడావుడి ఉంటుంది. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తుంటారు. కానీ, ఈ రోజు మాత్రం కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం లేదు. దీనికి ఓ కారణం ఉంది.

 రాహుల్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వేడుకలకు దూరంగా ఉంది.  అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా  నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని రాహుల్ గాంధీ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సందేశం పంపించారు. అగ్నిపథ్ పై  దేశంలోని యువకులు ఎంతో  వేదనకు గురవుతున్నారని, వీధుల్లో నిరసనలు చేస్తున్న వారికి  కార్యకర్తలు అండగా నిలవాలని సూచించారు. 

‘దేశంలో యువత వేదనలో ఉంది. ఈ సమయంలో మనం వారికి, వారి కుటుంబాలకు అండగా ఉండాలి. నా పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మనం యువత, వారి కుటుంబాల బాధలను పంచుకోవాలి. వారికి అండగా నిలబడాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.


More Telugu News