నోట్ల రద్దుకు మించిన పెద్ద బ్లండర్ అగ్నిపథ్: తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్
- అగ్నిపథ్ పథకంపై కొనసాగుతున్న నిరసనలు
- మోదీ ప్రభుత్వం ప్రతిసారీ సైన్యాన్ని అపహాస్యం చేస్తోందన్న వినోద్ కుమార్
- కేంద్రానికి యువత గుణపాఠం చెబుతారని హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలు ఇంకా చల్లారలేదు. నిన్న కూడా పలు రాష్ట్రాల్లో నిరసనలు జరిగాయి. తాజాగా, ఈ పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వి.వినోద్ కుమార్ కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. కేంద్రం అగ్నిపథ్‌ను తీసుకొచ్చి నోట్ల రద్దు కంటే పెద్ద తప్పు చేసిందని అందులో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ప్రతిసారి సైన్యాన్ని అపహాస్యం చేస్తోందని, దాని నుంచి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రానికి ఈసారి యువత సరైన గుణపాఠం చెబుతారని వినోద్ కుమార్ హెచ్చరించారు.
కాగా, ఆల్ ఫర్ యానిమల్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీలక్ష్మి భూపాల్, యానిమల్ బ్లడ్ లైన్ ఫౌండర్ శివకుమార్ వర్మ నిన్న వినోద్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ ప్రాంగణంలో జంతువుల బ్లడ్ బ్యాంకుతోపాటు జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం బ్లడ్ రీసెర్చ్ సెంటర్‌ను నెలకొల్పే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు.