లండన్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన తెలంగాణ మంత్రి తలసాని
- సికింద్రాబాద్ లో హింసాత్మక ఘటనలు
- అగ్గిరాజేసిన అగ్నిపథ్
- రాకేశ్ అనే యువకుడు పోలీసు కాల్పుల్లో మృతి
- స్పందించిన మంత్రి తలసాని
కేంద్రం ప్రతిపాదిస్తున్న సైనిక నియామకాల నూతన విధానం అగ్నిపథ్ నేపథ్యంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విధ్వంసం, హింస చోటుచేసుకున్నాయి. పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు కూడా మృతి చెందాడు. దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ప్రస్తుతం ఆయన లండన్ లో ఉన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ఈ ఘటనలో మరణించిన రాకేశ్ కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం హింసావాదాన్ని ప్రోత్సహిస్తోందని తలసాని విమర్శించారు. ఈ సందర్భంగా లండన్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపినట్టు వెల్లడించారు. మోదీకి మంచి బుద్ధి కలగాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వేడుకున్నానని తెలిపారు.
.