'బీస్ట్' సూత్రాన్నే ఫాలో అవుతున్న 'జైలర్'
- రజనీ తాజా చిత్రంగా రూపొందుతున్న 'జైలర్'
- నిర్మాణ సంస్థగా సన్ పిక్చర్స్
- ప్రత్యేకంగా వేసిన జైలు సెట్
- సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే, పెద్దగా బడ్జెట్ అవసరం లేని కథలను ఆయన తయారు చేసుకోవడం కనిపిస్తుంది. అలా సిద్ధం చేసుకున్న కథలను ఉత్కంఠను రేకెత్తించే విధంగా తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. 'బీస్ట్' సినిమా భారీగా కనిపించినప్పటికీ సన్ పిక్చర్స్ వారికి అది పెద్ద ఖర్చు కానేకాదు.
ఈ సినిమా కథ అంతా కూడా ఒక షాపింగ్ మాల్ చుట్టూ తిరుగుతుంది. ఈ కారణంగానే ఈ సినిమా విజయ్ కి గల క్రేజ్ కి తగిన వసూళ్లను రాబట్టకపోయినా నష్టాలు మాత్రం రాలేదు. అందువల్లనే వాళ్లు అదే దర్శకుడితో రజనీ సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమాకి 'జైలర్' అనే టైటిల్ ను ఖరారు చేసి టైటిల్ పోస్టర్ ను వదిలారు.
ఈ సినిమాలో రజనీ 'జైలర్' గా కనిపిస్తాడట. కథ అంతా కూడా 'జైల్' చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ప్రత్యేకంగా వేసిన జైల్ సెట్ లోనే దాదాపు షూటింగు జరుగుతుందని చెబుతున్నారు. పెద్ద హీరోలతో చిన్న బడ్జెట్ లో .. టైట్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించడమనేది నెల్సన్ స్టైల్ గా మారింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.