దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 13 వేలు దాటిన రోజువారీ కేసులు!

  • గత 24 గంటల్లో 13,216 కేసుల నమోదు
  • కరోనా కారణంగా మృతి చెందిన 23 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 68,108
దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా 12 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసుల సంఖ్య.. ఈరోజు 13 వేలను దాటింది. గత 24 గంటల్లో 4,84,924 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 13,216 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 8,148 మంది కరోనా నుంచి కోలుకోగా... 23 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 5,24,840 మంది మృతి చెందారు. 

రోజువారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.63 శాతంగా, క్రియాశీల రేటు 0.16 శాతంగా ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 14,99,824 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.


More Telugu News