పుల్వామాలో ఎస్ఐని ఇంటికొచ్చి కాల్చేసిన ఉగ్రవాదులు
- శుక్రవారం అర్ధరాత్రి దాడి
- అక్కడికక్కడే చనిపోయిన ఎస్ఐ ఫరూక్ అహ్మద్ మీర్
- ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు
జమ్మూ కశ్మీర్లోని పుల్వామా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఉగ్రవాదులు అక్కడ మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ పోలీస్ అధికారి ఇంట్లోకి చొరబడి అతడిని కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలో ఈ ఘటన జరిగింది.
ఎస్‌ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంటిపై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఎస్పైపై కాల్పులు జరిపారు. ముష్కరుల దాడిలో గాయపడ్డ ఎస్ఐ ఫరూక్ అక్కడిక్కడే చనిపోయారు. ఫరూక్ ప్రస్తుతం లేత్‌పొరాలో సిటీసీలోని ఐఆర్‌పీ 23వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు తండ్రి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.