నేను కనుక చనిపోతే అందుకు రాజ్‌నాథ్ సింగే బాధ్యత వహించాలి: సికింద్రాబాద్ కాల్పుల్లో గాయపడిన యువకుడు

  • సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లలో పాల్గొన్న వినయ్
  • చాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్
  • 108 వాహన బెడ్‌పై ఉండి మాట్లాడిన బాధితుడు
‘అగ్నిపథ్’కు నిరసనగా నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మధ్యవంచ గ్రామానికి చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి చాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. 

ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. తాను కనుక చనిపోతే అందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నాడు. తీవ్ర రక్తస్రావంతో 108 వాహనంపై ఉండి ఈ మాటలు చెప్పిన వినయ్ వీడియో వైరల్ అవుతోంది.


More Telugu News