దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20... టీమిండియాకు మొదట బ్యాటింగ్
- రాజ్ కోట్ లో మ్యాచ్
- టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
- ఛేజింగ్ ఎంచుకున్న సఫారీలు
- సఫారీ జట్టులోకి డికాక్, మార్కో జాన్సెన్, ఎంగిడీ
టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రాజ్ కోట్ లో నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని టీమిండియా సారథి రిషబ్ పంత్ వెల్లడించాడు.
అటు, దక్షిణాఫ్రికా జట్టులో గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ పునరాగమనం చేశాడు. బౌలింగ్ ను బలోపేతం చేసేందుకు మార్కో జాన్సెన్, లుంగీ ఎంగిడీలను కూడా తుదిజట్టులోకి తీసుకున్నారు. ఐదు మ్యాచ్ ల ఈ టీ20 సిరీస్ లో దక్షిణాఫ్రికా 2-1తో ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 మ్యాచ్ లో నెగ్గిన టీమిండియా... నేటి మ్యాచ్ లోనూ నెగ్గి సమం చేయాలని కోరుకుంటోంది.