ఈ నెల 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నిపథ్ నియామకాలు!
- ఓవైపు అగ్నిపథ్ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనలు
- మరోవైపు నియామకాల దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం
- త్వరలోనే నియామకాలను చేపట్టనున్న ఇండియన్ ఆర్మీ
భారత త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ పథకం కింద నియామకాలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. జూన్ 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రకటన ద్వారా తెలిపారు.
17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని వీఆర్ చౌధరి చెప్పారు అయితే కరోనా కారణంగా గత రెండేళ్లుగా సైనిక నియామకాలను చేపట్టలేదని... అందువల్ల గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచినట్టు తెలిపారు. మరోవైపు త్వరలోనే నియామకాలను చేపడుతున్నట్టు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించిన సంగతి తెలిసిందే.