సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన

  • కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పై నిరసనల వెల్లువ
  • రైళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న ఆందోళనకారులు
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ భారీ విధ్వంసం
  • పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి
  • ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
కేంద్రం తీసుకువస్తున్న అగ్నిపథ్ సైనిక నియామక విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ భారీ విధ్వంసం జరగ్గా, పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 

ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రక్రియపై చేపట్టిన నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ తన ప్రకటనలో వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకొనేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.


More Telugu News