సికింద్రాబాద్ లో అల్లర్ల నేపథ్యంలో.. విజయవాడ రైల్వే స్టేషన్ లో హై అలర్ట్!
- అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు
- సికింద్రాబాద్ స్టేషన్లో మూడు రైళ్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
- ఏపీలో ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అగ్నిపథ్ కార్యక్రమానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు మూడు రైళ్లకు నిప్పుపెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదులో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను ఆపేశారు. నాంపల్లి స్టేషన్ ను మూసివేశారు.
ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు భద్రతను రప్పించారు. రైల్వే స్టేషన్ల పరిధిలో జనాలు గుమికూడకుండా చర్యలు చేపట్టారు.