సికింద్రాబాద్ స్టేషన్ లో ఆందోళనకారులపై కాల్పులు...ఒకరి మృతి!

  • అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో ఆందోళన
  • రైళ్లను తగులబెట్టిన ఆందోళనకారులు
  • కాల్పులు జరిపిన పోలీసులు 
అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని, ఇప్పటికే రద్దు చేసిన ఆర్మీ పరీక్షను తిరిగి పెట్టాలని డిమాండ్ చేస్తూ సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆందోళనకారులు రైల్వేస్టేషన్ ను ధ్వంసం చేయడంతో పాటు, మూడు రైళ్లకు నిప్పు పెట్టారు. 

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎంతో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో... ఆందోళనకారులు పోలీసులపై రుళ్లు రువ్వారు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక యువకుడికి ఛాతీలో బుల్లెట్ దిగింది. ఈ యువకుడిని పోలీసులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ ఆందోళనల్లో 11 మంది యువకులు గాయపడ్డారు. వీరందరికీ గాంధీలో చికిత్స అందిస్తున్నారు.


More Telugu News