దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు
- సికింద్రాబాద్ స్టేషన్ కు రాకుండా చర్యలు
- కొన్ని రైళ్లు చర్లపల్లి స్టేషన్ వరకే అనుమతి
- సనత్ నగర్, అమ్ముగూడ, చర్లపల్లి మీదుగా కొన్ని దారి మళ్లింపు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింసాత్మక చర్యలు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు ప్రయాణికుల రైళ్లను తాల్కాలికంగా రద్దు చేసింది. కొన్నింటిని పాక్షికంగా ప్రయాణ మార్గాలను మళ్లిస్తూ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్-షాలిమార్ (18046), ఉందానగర్-సికింద్రాబాద్ (07078), సికింద్రాబాద్-ఉందానగర్ (07055), ఉందానగర్-సికింద్రాబాద్ (07056), సికింద్రాబాద్-ఉందానగర్ (07059), ఉందానగర్-సికింద్రాబాద్ (07060) రైళ్లను 17వ తేదీన పూర్తిగా రద్దు చేశారు.
సికింద్రాబాద్-రేపల్లె (17645) రైలును సికింద్రాబాద్ నుంచి కాకుండా చర్లపల్లి స్టేషన్ నుంచి 17వ తేదీన ప్రయాణిస్తుంది. షిర్డీ సాయి నగర్ - కాకినాడ పోర్ట్ (17025) రైలును సనత్ నగర్, అమ్ముగూడ, చర్లపల్లి మీదుగా పంపిస్తారు. సికింద్రాబాద్ స్టేషన్ లోకి రాదు. సనత్ నగర్, చర్లపల్లిలో ఆగుతుంది. భువనేశ్వర్ - ముంబై సీఎస్ టీ (11020) చర్లపల్లి, అమ్ముగూడ, సనత్ నగర్ మీదుగా వెళుతుంది. ఈ రెండూ 16వ తేదీన బయల్దేరిన వాటికి ఈ షెడ్యూల్ వర్తిస్తుంది.
ఇక హౌరా-సికింద్రాబాద్ (12703) రైలును పాక్షికంగా మౌలాలి-సికింద్రాబాద్ మధ్య నేడు రద్దు చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234) రైలు సైతం మౌలాలి-సికింద్రాబాద్ మధ్య ప్రయాణించదు. గుంటూరు - వికారాబాద్ (12743) రైలు చర్లపల్లి-వికారాబాద్ మధ్య ప్రయాణించదు. దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్ ఈ వివరాలను విడుదల చేశారు.