అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పులు.. ఒకరి మృతి
- సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో కాల్పులు
- పోలీసుల అదుపులో నిందితుడు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
అమెరికాలో తుపాకుల మోతకు తెరపడడం లేదు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్‌లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. తాజాగా నిన్న సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
బర్మింగ్‌హామ్ సబర్బ్ వెస్టావియా హిల్స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని గుర్తించాల్సి ఉంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.