తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
- క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్ రెడ్డి ఇంటిలోనూ తనిఖీలు
- సోదాలు చేస్తున్న 20 మంది అధికారులు
- తాడిపత్రిలో భారీ బందోబస్తు
అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేపట్టారు. మొత్తం 20 మంది అధికారులు వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తున్నారు. సోదాల నేపథ్యంలో తాడిపత్రిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.