ఇంగ్లండ్ పయనమైన టీమిండియా... కాస్త ఆలస్యంగా వెళ్లనున్న రోహిత్ శర్మ
- గతంలో వాయిదాపడిన ఐదో టెస్టు
- జులై 1 నుంచి 5 వరకు టెస్టు రీషెడ్యూల్
- ఎడ్జ్ బాస్టన్ వేదికగా మ్యాచ్
- ఈ నెల 20న రోహిత్ పయనం
గతంలో వాయిదా పడిన ఐదో టెస్టు ఆడేందుకు టీమిండియా నేడు ఇంగ్లండ్ పయనమైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఈ నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జులై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. అయితే, టెస్టు జట్టు సారథి రోహిత్ శర్మ కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు. రోహిత్ కు గాయాల ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. రోహిత్ శర్మ ఈ నెల 20న ఇంగ్లండ్ బయల్దేరనున్నాడు. కోహ్లీ స్థానంలో టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ కెప్టెన్ గా నియమితుడైన సంగతి తెలిసిందే.
కాగా, ఇవాళ ఇంగ్లండ్ వెళ్లిన ఆటగాళ్లలో కోహ్లీ, బుమ్రా, షమీ, పుజారా, జడేజా, శార్దూల్ ఠాకూర్, శుభ్ మాన్ గిల్, ప్రసిద్ధ్ తదితరులున్నారు. కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ కూడా ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ వెళతాడు.