గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు సీఎం జగన్ నిర్ణయం
- గ్రామ/వార్డు సచివాలయ కొలువుకు భద్రత
- ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై సీఎం సంతకం
- పీఆర్సీ వర్తింపజేయాలన్న సీఎం జగన్
- ప్రొబేషన్ ఇచ్చే అధికారం కలెక్టర్లకు!
గ్రామ, వార్డు సచివాలయ కొలువులకు భద్రత కల్పించడానికి సీఎం జగన్ సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ను డిక్లేర్ చేయాలని నిర్ణయించారు. ప్రొబేషన్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై ఆయన సంతకం చేశారు.
కాగా, శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికే ప్రొబేషన్ డిక్లరేషన్ అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రొబేషన్ ఇచ్చే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. జులై 1 నుంచి ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలని ఆదేశించారు.