దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోదీ, అమిత్ షాలకు చెప్పా: కేఏ పాల్
- రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారన్న పాల్
- బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశం నాశనమవుతోందని విమర్శ
- కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఎంపీలే ఉండరని వ్యాఖ్య
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోస్యం చెప్పారు. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదని, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వారు రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండేందుకు ఇష్టపడటం లేదని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమైతేనే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. విపక్షాలు వేర్వేరు కూటములుగా ఉంటే అది బీజేపీకి లాభిస్తుందని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల దేశం నాశనమైపోతోందని కేఏ పాల్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఒక మంచి అభ్యర్థిని ఎన్డీయేకు సూచించానని చెప్పారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు తెలిపానని అన్నారు. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఎంపీలే ఉండరని పాల్ చెప్పారు.