గుండెపోటుకు గురైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా... ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలింపు

  • హిమాచల్ ప్రదేశ్ లో తీవ్ర అస్వస్థతకు గురైన షా
  • మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి!
  • అత్యంత విషమంగా ఆరోగ్య స్థితి
  • కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్న సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా హిమాచల్ ప్రదేశ్ లో గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనను మెరుగైన వైద్య చికిత్స కోసం హుటాహుటీన ఎయిర్ అంబులెన్స్ ద్వారా దేశ రాజధాని ఢిల్లీకి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతోంది. జస్టిస్ ఎంఆర్ షా పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

64 ఏళ్ల షా గతంలో గుజరాత్ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తించారు. అనంతరం పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా అడుగుపెట్టారు. ఆయన 2023 మే 15న పదవీవిరమణ చేయనున్నారు.


More Telugu News