ఉత్తరకొరియాలో పంజా విసురుతున్న సరికొత్త అంటువ్యాధి

  • ఇప్పటికే జ్వరం కేసులతో సతమతమవుతున్న ఉత్తరకొరియా
  • ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంతుచిక్కని అంటువ్యాధి
  • పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్న అధికారులు
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ఉత్తరకొరియా చాలా ప్రశాంతంగా ఉంది. అయితే, ప్రపంచంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళ ఆ దేశంలో మహమ్మారి పంజా విసిరింది. ప్రస్తుతం ఉత్తరకొరియాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే జ్వరం లక్షణాలతో బాధ పడుతున్న కేసులు 26,010 వచ్చాయి. దీంతో ఈ కేసుల మొత్తం సంఖ్య 40,56,000కి చేరింది.

 మరోవైపు ఆ దేశంలో కొత్తగా మరో అంటువ్యాధి ఆందోళనను కలిగిస్తోంది. ఓడరేవు నగరమైన హేజులో అంతుచిక్కని అంటువ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. ఇది పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన ఎంత మంది పడ్డారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.


More Telugu News