తిరుపతిలో మ్యాన్ హోల్ ప్రమాదంపై తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేశ్
- ఘటనపై నివేదిక కోరిన మంత్రి ఆదిమూలపు సురేశ్
- అధికారుల నిర్లక్ష్యం ఉంటే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరిక
- మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
తిరుపతిలో మ్యాన్ హోల్ ప్రమాదంపై ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. పారిశుద్ధ్య కార్మికుని మృతి తరహా ఘటనలు పునరావృతమైతే కఠినచర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీల్లో కార్మికుల ఆరోగ్య భద్రత, రక్షణ కోసం చేపట్టిన చర్యలపై వివరణ కోరారు.
అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడినట్టు తేలితే కఠినచర్యలు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.