ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి.. వీడియో ఇదిగో!
- రాహుల్ గాంధీని విచారిస్తున్న ఈడీ
- దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
- హైదరాబాద్ లో గాంధీభవన్ ను ముట్టడించేందుకు యత్నం
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజుతో ఈడీ విచారణ మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. గాంధీ కుటుంబం గౌరవాన్ని దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వారు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
ఈ నిరసనల్లో భాగంగా హైదరాబాద్ లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. రాజ్ భవన్ ముట్టడికి నేతలు, కార్యకర్తలు కదలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక ఎస్సై కాలరును ఆమె పట్టుకున్నారు. తనను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎస్సైని ఆమె హెచ్చరించారు.