విజయవాడలో ఇక అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్ల నిర్వహణకు అనుమతి

  • హోటళ్లు, రెస్టారెంట్ల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
  • ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరుచుకునేందుకు అనుమతి
  • ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకే అనుమతి
విజయవాడలో ఇక నుంచి అర్ధరాత్రి కూడా ఆహారం అందుబాటులో ఉండనుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నగరంలోని హోటళ్లు పనిచేస్తున్నాయి. సిట్టింగ్‌కు మాత్రం 11 గంటలకు అనుమతి ఉంది. 

అయితే, కరోనా తమ వ్యాపారాలను కుదేలు చేసిందని, కాబట్టి సమయాలను పెంచడం ద్వారా కోలుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర హోటల్స్, రెస్టారెంట్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తెల్లవారుజామున 5.30 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి పెట్టుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News