జగన్‌కూ లేఖ రాసిన దీదీ... భేటీ ముగిశాక బయటకొచ్చిన ఆహ్వానం
- ఈ నెల 11ననే జగన్‌కు దీదీ లేఖ
- విపక్షాల భేటీకి హాజరుకావాలని వినతి
- భేటీ ముగిశాక లేఖను బయటపెట్టిన ఏఎన్ఐ
- తమకు దీదీ నుంచి ఆహ్వానమే అందలేదన్న సాయిరెడ్డి
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపే దిశగా దేశంలోని వివిధ రాజకీయ పార్టీలతో బుధవారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన భేటీకి రావాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఈ మేరకు ఈ నెల 11ననే జగన్‌కు మమతా బెనర్జీ లేఖ రాశారు.
అయితే దీదీ నుంచి జగన్‌కు ఆహ్వానం అందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పలు రాజకీయ పార్టీల నేతలతో బుధవారం ఢిల్లీలో దీదీ భేటీ ముగిశాక ఈ లేఖను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ బయటపెట్టింది. జగన్‌కు దీదీ రాసిన లేఖను విడుదల చేసిన ఆ వార్తా సంస్థ... ఈ భేటీకి వైసీపీ అధినేతను ఆహ్వానిస్తూ ఈ నెల 11ననే దీదీ లేఖ రాసినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే... విపక్షాలతో దీదీ భేటీపై బుధవారం ఉదయం స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఓ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బుధవారం వరకూ ఈ భేటీకి సంబంధించి తమకు దీదీ నుంచి లేఖ అందలేదని ఆయన ప్రకటించారు. భేటీ ముగిశాక ఈ లేఖ బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.