చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేసింది: భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

  • పెగాస‌స్ వ్య‌వ‌హారంపై భూమ‌న ఆధ్వ‌ర్యంలో అసెంబ్లీ హౌజ్ క‌మిటీ
  • అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో భేటీ అయిన క‌మిటీ
  • ఆర్థిక‌, ఐటీ శాఖ‌ల అధికారుల విచార‌ణ‌
  • జులై 5, 6 తేదీల్లో మరోసారి భేటీ అవుతామ‌న్న భూమ‌న‌
  • దోషుల‌ను ప్ర‌జ‌ల ముందు నిల‌బెడ‌తామ‌ని ప్ర‌క‌ట‌న‌
ఏపీలో గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్రైవేట్ వ్య‌క్తుల ఫోన్ల‌ను ట్యాప్ చేసింద‌ని తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేర‌కు పెగాస‌స్ నిఘా ప‌రిక‌రాల కొనుగోలు అంశంపై ఏర్పాటైన శాస‌న‌స‌భా క‌మిటీ చైర్మ‌న్ హోదాలో భూమ‌న బుధ‌వారం ఓ కీల‌క ప్ర‌కట‌న చేశారు. బుధ‌వారం అమ‌రావ‌తిలోని అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఈ క‌మిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి ఆర్థిక‌, ఐటీ శాఖ‌ల అధికారుల‌ను పిలిపించిన క‌మిటీ స‌భ్యులు వారిని విచారించారు. 

  అనంత‌రం భూమన మీడియాతో మాట్లాడుతూ‌.. గత టీడీపీ ప్రభుత్వం అడ్డదారుల్లో పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు చేసి వ్యక్తులు, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారంలో దోషులను ప్రజల ముందు నిలబెడతామని ఆయ‌న తెలిపారు. బుధ‌వారం నాటి సమావేశంలో ప్రాథమికంగా చర్చించామ‌ని చెప్పిన భూమ‌న‌... వచ్చే సమావేశంలో పెగాసస్‌తో పాటు ఇతర అంశాలపైనా విచారిస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తామన్నారు. జులై 5, 6 తేదీల్లో మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయించామని భూమ‌న తెలిపారు.


More Telugu News