రవితేజ చేతుల మీదుగా 'చోర్ బజార్' సాంగ్ రిలీజ్!

  • ఆకాశ్ పూరి హీరోగా 'చోర్ బజార్'
  • దర్శకుడిగా జీవన్ రెడ్డి 
  • కథానాయికగా గెహెనా సిప్పీ 
  • ఈ నెల 24వ తేదీన విడుదల
ఆకాశ్ పూరి హీరోగా 'చోర్ బజార్' సినిమా రూపొందింది. హీరోగా ఆకాశ్ చేసిన మూడో సినిమా ఇది. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆకాశ్ పూరి జోడీగా గెహనా సిప్పీ అలరించనుంది. మాస్ హీరోగా ఆకాశ్ పూరిని తెరపైకి తీసుకువచ్చే ఈ సినిమా నుంచి అప్ డేట్స్ వదులుతూ వస్తున్నారు.  

ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రవితేజ చేతుల మీదుగా 'బచ్చన్ సాబ్' లిరికల్ సాంగును రిలీజ్ చేయించారు. మదీన్ స్వరపరిచిన ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని సమకూర్చగా మంగ్లీ ఆలపించారు.

'జార్జి రెడ్డి' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి చేసిన సినిమా కావడంతో ఆడియన్స్ లో అంచనాలు ఉన్నాయి. ఇంతవరకూ లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చిన ఆకాశ్ .. ఈ సారి మాస్ ఇమేజ్ వైపు పూర్తి దృష్టి పెట్టి చేసిన సినిమా ఇది. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో సీనియర్ నటి అర్చన నటించడం విశేషం.


More Telugu News